జనాభా పెరుగుదలకు నా వంతు కృషి చేస్తున్నా: తనపై తానే జోక్ పేల్చుకున్న 9 మంది బిడ్డల తండ్రి ఎలాన్ మస్క్

  • మస్క్ కు గతేడాది ఇద్దరు కవలలు
  • బిజినెస్ ఇన్ సైడర్ లో కథనం
  • స్పందించిన మస్క్
  • జనాభా తక్కువైపోతోందంటూ చమత్కారం
  • అందుకే పిల్లల్ని కంటున్నానని వెల్లడి
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ 9 మంది బిడ్డలకు తండ్రి అన్న సంగతి తెలిసిందే. మస్క్ కు టెస్లా, స్పేస్ ఎక్స్, న్యూరాలింక్ వంటి అనేక సంస్థలు ఉన్నాయి. అయితే, న్యూరాలింక్ కంపెనీలో ఉన్నతస్థాయి ఉద్యోగిని షివోన్ జిల్స్ తో ప్రేమాయణం కారణంగా మస్క్ గతేడాది ఇద్దరు కవలలకు తండ్రి అయ్యాడని కథనాలు వచ్చాయి. 

దీనిపై మస్క్ తనపై తానే జోక్ వేసుకున్నారు. ప్రపంచం తక్కువ జనాభాతో బాధపడుతోందని నా వంతు కృషి చేస్తున్నానని, అంతేకాదు, భవిష్యత్తులో ప్రపంచ జననాల రేటు దారుణంగా పడిపోయే అవకాశముందని మస్క్ పేర్కొన్నారు. అందుకే జనాభా పెంచుతున్నా అంటూ చమత్కరించారు. 

2021లో మస్క్, జిల్స్ కవలలకు జన్మనిచ్చారంటూ బిజినెస్ ఇన్ సైడర్ పత్రిక పేర్కొంది. తమ కవల పిల్లల పేర్లలో మధ్యలో తల్లి పేరు, చివరన తండ్రి పేరు వచ్చేలా మార్పులు చేసేందుకు కూడా వారు దరఖాస్తు చేసుకున్నారని వివరించింది. 

ఎలాన్ మస్క్ కు ఇప్పటికే కెనడా రచయిత జస్టిన్ విల్సన్ తో గ్రిఫిన్, వివియన్, కాయ్, శాక్సన్, డామియన్ అనే ఐదుగురు సంతానం కలిగారు. ఇక గాయని గ్రిమ్స్ తో ఆయనకు గ్జాయే ఆగ్జి, ఎక్సా డార్క్ సిడరేల్ అనే సంతానం కలిగారు. ఇప్పుడీ కవలలతో ఆయన సంతానం సంఖ్య 9కి పెరిగింది.

Elon Musk
Joke
Twins
Children

More Telugu News